Vijaya Sai Reddy Allegations on chandrababu Naiduవైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు మీద చేసే విమర్శలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. తాజగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో చేసిన కుట్ర బయటపడిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. ట్విటర్‌ లో దీనిపై ఆయన వ్యాఖ్యానించారు.

“బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు చంద్రబాబు నాయుడు తెగబడ్డాడు. బీసీజీ వికీపీడియా ప్రొఫైల్‌ను ఎడిట్ చేయించి సీఎం జగన్‌మోహన్ రెడ్డికి 50% వాటాలున్నాయని రాయించాడు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని ‘ది హిందూ’ పత్రిక బయట పెట్టింది. పాతాళానికి జారిపోయావు బాబూ!” అని ఆయన ట్వీట్‌ చేశారు.

వికీపీడియా అనేది ఒక ఓపెన్ సోర్స్ వెబ్ సైట్. దానిని ఎవరైనా ఎడిట్ చెయ్యవచ్చు. సదరు అప్డేట్స్ సరైనవా కావా అనే నిర్ణయం వికీపీడియా టీం తీసుకుంటుంది. దానికి చంద్రబాబు చేయించాల్సిన పని లేదు. నిజంగా టీడీపీ అభిమానులు చేసి ఉండవచ్చు లేదా కడుపు మండిన రాజధాని రైతులు చేసి ఉండవచ్చు లేదా మరో పార్టీ వారు ఎవరైనా చేసి ఉండవచ్చు.

ప్రతిదానికీ చంద్రబాబుని నిందించడం, ఏకంగా కుట్రలు చేస్తున్నారు అనడం విచిత్రంగానే ఉంది. ప్రతీ దానికీ చంద్రబాబుని నిందించడమేనా? ఇది ఇలా ఉండగా రాజధాని తరలింపుకి వ్యతిరేకంగా జరుగుతున్నా రైతు పోరాటం 21వ రోజుకు చేరింది.