తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక “తేరి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ పక్కా ఎంటర్టైన్మెంట్ చిత్రంగా కనపడుతోంది. ‘భాజరంగి భాయేజన్’ సినిమా మాదిరి చిన్న పాపతో విజయ్ సన్నివేశాలు పూర్తి వినోదాత్మకంతో పాటు కధలోని డెప్త్ ను ప్రేక్షకులకు తెలియజేస్తోంది.
ఇక, ట్రైలర్ రెండవ పార్ట్ లో పోలీస్ డ్రెస్ లో విజయ్ చేసిన ఎంటర్టైన్మెంట్ తో పాటు అభిమానులకు కావలసిన యాక్షన్ కూడా సమపాళ్ళలో అందించింది. దీంతో ఈ ట్రైలర్ పై పూర్తి సంతృప్తిని వ్యక్తపరుస్తూ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ 50వ సినిమాకు సంగీతం అందిస్తున్న చిత్రంగా కూడా “తేరి” మరో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. అప్పటివరకు అభిమానులకు కిక్ ఇచ్చే విధంగా ట్రైలర్ ను రూపొందించారు.