Vijayasai Reddy supports his party leadersరెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహాలు చిత్రంగా ఉంటున్నాయి. తాజాగా రఘు రామకృష్ణ రాజు తమని తిట్టాడని, పందులు అన్నాడని స్వయంగా మంత్రి రంగనాధరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కేసు పెట్టారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇటు నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారమూరి నాగేశ్వరరావు, కొట్టి సత్యనారయణ కూడా ఫిర్యాదుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఒక టీవీ డిబేట్ లో పందులే గుంపుగా వస్తాయి తాను సింహం సింగల్ గా వస్తా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే ఇళ్ల పట్టాలు, ఇసుక విషయంలో మంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేలుపై ఎంపీ రఘురామ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, కొనుగోళ్లలో కూడా గోల్‌మాల్‌ జరుగుతోందన్నారు. అలాగే ఇసుక మాఫియా వెనుక ఎమ్మెల్యేల ఉన్నారని విమర్శించారు.

ఇప్పుడు ఈ కేసు వ్యవహారం పై సోషల్ మీడియాలో ఆ పార్టీ మీద పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. “పంది అన్న పదానికే కేసు పెడితే… వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రి కొడాలి నాని పై రోజుకు ఎన్ని కేసులు నమోదు కావాలి? అలాగే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వేసే ప్రతీ ట్వీట్ ఒక కేసు పెట్టదగింది కాదా?,” అంటూ వారు విమర్శిస్తున్నారు.