Telugu

బీజేపీ గురించి బాధ పడిపోతున్న విజయసాయి రెడ్డి… రిస్కు ఎవరికి?

Share

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం కాబట్టి విమర్శ అనేదే ఉండకూడదు అనుకుంటుంది. తాము ఏం చేసినా అటు కోర్టులు గానీ ఇటు ప్రతిపక్షాలు గానీ విమర్శించకూడదని వారు కోరుకుంటున్నారు. అయితే బీజేపీ నుండి అటువంటి విమర్శలు వస్తే మాత్రం ఆ పార్టీ బాగా ఇబ్బంది పడుతుంది.

అయితే యధావిధిగా నెపం తెలుగుదేశం మీద నెట్టేసి ఏమీ లేదని అని సరిపెట్టుకుంటుంది. “ఏమీ తినడానికి దొరకని తెలుగుదేశం పార్టీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయన్నాయని గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో ముందు ముందు చూడాలి,” విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

బీజేపీ గానీ కేంద్రం గానీ విమర్శలు చేస్తే ఆ ప్రమాదం వైఎస్సార్ కాంగ్రెస్ కు…, అది గుర్తించకుండా ఆ పని టీడీపీ కోవర్టులది అంటూ సరిపెట్టుకుంటే అది ఆ పార్టీకే నష్టం. మొన్న ఆ మధ్య కేంద్ర ఆర్ధిక మంత్రి కూడా రాష్ట్రప్రభుత్వం మీద విమర్శలు చేశారు. అది కూడా పరకాల వల్ల అంటూ సర్దిచెప్పుకుంటున్నారు అధికార పక్ష నేతలు.

బీజేపీ చేసే అన్నిటికీ తెలుగుదేశం పార్టీని నిందుచుకుంటూ పోతే… అది ఆ పార్టీకి నష్టం కాదు. ప్రజలు కూడా టీడీపీ, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి… లేకపోతే టీడీపీ నుండి బీజేపీకి వెళ్లిన నేతలు కేంద్రాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే నమ్మే పరిస్థితి ఉండదు. కావున ఏదో విధంగా బీజేపీని ప్రసన్నం చేసుకుంటే ఈ విషయంలో ఇబ్బంది ఉండదు.