Vijay Sai Reddy  took blessings from narendra modi-రాజ్యసభలో ఈరోజు జరిగిన ఓ దృశ్యం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ రాజ్యసభలోకి వస్తున్న సమయంలో ఎంపీలందరూ నమస్కారం చేశారు. అయితే ఆయన భాజపా ఎంపీలు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రమే ప్రతి నమస్కారం చేస్తూ తన స్థానంలో కూర్చున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మోదీ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు.

మోదీ ఆయన్ని తట్టి లేపి అభినందించారు. అనంతరం విజయసాయిరెడ్డి తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యి అన్ని టీవీ ఛానెళ్లలోను ప్రముఖంగా వచ్చింది. ఈ వార్త వైకాపా బీజేపీ లాలూచీ పడ్డాయని టీడీపీ చేస్తున్న ఆరోపణలను నిజం అనుకునేలా ఉన్నవి.

దీనితో వైకాపా, జగన్ కు టెన్షన్ మొదలయ్యినట్టు సమాచారం. పొరపాటున ఈ వీడియో బయటకు వస్తే పార్టీకి కోలుకోలేని దెబ్బని వారు భావిస్తున్నారు. దీనిపై జగన్ ఇప్పటికే విజయసాయిరెడ్డి తో మాట్లాడి గట్టిగానే మందలించినట్టు సమాచారం. జగన్ కు కుడిభుజం వంటి విజయసాయిరెడ్డి ఈ మధ్య పార్టీకి భారంగా పరిణమించడం పార్టీ వారికి మింగుడు పడటం లేదు