Vijayasai Reddy supports his party leadersదాదాపుగా 100 మంది వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు కోర్టు నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానాలకు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించారని వారి మీద ఆరోపణ. అయితే ఈ విషయంగా తమ కార్యకర్తలను విజయసాయి రెడ్డి వెనకేసుకొని రావడం గమనార్హం.

“నోటీసులు అందుకున్న కార్యకర్తలకు పార్టీ తరపున అండగా ఉంటాం. మా వాళ్లంతా అమాయకులు. టీడీపీ కవ్వింత చర్యలకు ప్రతిగా అటువంటి పోస్టులు పెట్టారే తప్ప న్యాయవ్యవస్థను కించపరచాలనే ఉద్దేశం వారికి ఎప్పుడూ లేదు,” అంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియా ముందుకు చెప్పుకొచ్చారు.

విశేషం ఏమిటంటే… నోటీసులు అందుకున్న వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే, సాక్షిలో పని చేసే జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారు కూడా టీడీపీ కవ్వింతల వల్లే రెచ్చిపోయారా? నోటీసు అందుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ అయితే ఆ తరువాత కూడా తాను అన్నదాంట్లో తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు.

మరో ఎమ్మెల్యే అయితే ఇప్పుడు వంద మందే అన్నారు న్యాయస్థానాలు వైఖరి మార్చుకోకపోతే నాలుగు కోట్ల మంది అంటారు అని బాహాటంగానే చెప్పుకొచ్చారు. అంతెందుకు… ముఖ్యమంత్రి జగన్, విజయసాయి రెడ్డి కూడా పలుమార్లు చంద్రబాబు న్యాయస్థానాలను మ్యానేజ్ చేస్తున్నాడు అని ఆరోపించారు. విజయసాయి రెడ్డి చెప్పే అమాయకత్వం పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.