vijay sai reddy misses the logic on commenting chandrababu naiduముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో తిరుగుతున్నాడని, జాతీయ స్థాయి లీడర్‌నంటూ ఐటీ శాఖను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

అక్రమసంపాదన కేసుల్లో చిక్కుకున్న చిదంబరం, రాబర్ట్ వాద్రాలనే రాహుల్‌ కాపాడలేకపోయారని, ఇక నిన్నేం కాపాడతారని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఐటీ దాడులు నుండి రక్షణ పొందడానికి అయితే చంద్రబాబు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీను వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో ఎందుకు జతకడతారు? వారు అన్నట్టే అక్రమసంపాదన కేసుల్లో చిక్కుకున్న చిదంబరం, రాబర్ట్ వాద్రాలనే కాపాడలేకపోయిన సంగతి చంద్రబాబుకు తెలీదా?

అదే సమయంలో కోడి కత్తి కేసుపై మాట్లాడుతూ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)లు,కమిషన్‌లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్నది బహిరంగ రస్యం.అవి బాబు ‘సిట్‌’అంటే కూర్చుని,‘స్టాండ్‌’అంటే నిలబడి తమ వీరవిధేయతను ప్రకటిస్తాయి.సీఎంగా 14ఏళ్ళ హయాంలో బాబు వేసిన సిట్‌లు,విచారణలు ఉత్తిత్తివే అన్నది చారిత్రక సత్యం. అయితే సిబిఐ విచారణ కావాలని విజయసాయిరెడ్డి కోరుకుంటున్నారా? గతంలో అదే సిబిఐ మీద ఎన్నో ఆరోపణలు చూసారుగా వైకాపా వాళ్ళు