Vijay Sai Reddyఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైఫల్యంతో ఏం జరిగినా అది చంద్రబాబు మీదకు నెట్టేసే ప్రయత్నం తరచు జరుగుతూ ఉంటుంది. తాజాగా అంతర్వేది రథం దగ్ధం కేసు కూడా చంద్రబాబు మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు.

“ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాం. త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుంది. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్‌ వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. ప్రవాస అంద్రుడిలా చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనుకుంటున్నారు,” అని చెప్పుకొచ్చారు.

రాజకీయపరమైన ఆరోపణలు ఎప్పుడూ ఉండేవే అవి పక్కన పెడితే… చంద్రబాబు ను ప్రవాస ఆంధ్రుడు అని విజయసాయి రెడ్డి సంబోధించడం విశేషం. 2018లో జగన్ పాదయాత్ర మొదలుపెట్టే ముందు వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ లో గడిపింది ఎన్ని రోజులు… అప్పట్లో జగన్ మీద కూడా అవే ఆరోపణలు వచ్చేవి.

“ఇప్పటికీ విజయసాయి రెడ్డి హైదరాబాద్ టు విశాఖపట్నం చక్కర్లు కొట్టే వ్యక్తే కదా? ఆ విషయం పక్కన పెడితే రాష్ట్రం మీద అంత ప్రేమ ఉన్న వ్యక్తి కరోనా పాజిటివ్ అని తెలగానే స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్లి అక్కడి ఆసుపత్రిలో ఎందుకు చేరినట్టు?,” అంటూ టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.