Vijay Sai Reddyఎందుకో ఏమో …. కమ్మ అనే పదం నీడ కూడా పొసగడం లేదు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు. కమ్మ అని పేరు ఉంటే తాడుని కూడా పాము అనుకునేలా ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులైన పురంధేశ్వరి పై వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి.

ఈనాడుకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె వికేంద్రీకరణ జరగాలని కానీ రైతులకు మాట ఇచ్చినట్టుగా అమరావతిలోని రాజధాని ఉండాలని అన్నారు. అయితే రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదని చెప్పుకొచ్చారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద కూడా విమర్శలు చేశారు ఆమె.

పురంధేశ్వరి అందరు బీజేపీ నాయకులలాగానే మాట్లాడినా ఎందుకనో విజయసాయి రెడ్డికి రుచించలేదు. పురంధేశ్వరి ఈ రోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది’ అంటూ ఎద్దేవా‌ చేశారు.

కేవలం ఎన్టీఆర్ కుటుంబసభ్యురాలు కావడం వల్లో లేక కమ్మ కులానికి చెందిన కావడం వల్లే విజయసాయి రెడ్డికి ఆమె అభిప్రాయం రుచించనట్టు ఉంది. ఇదే మాట సోము వీర్రాజు, జీవీఎల్ వంటివారు అంటే మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ విశేషం ఏమిటంటే… అదే జాతికి చెందిన పురంధేశ్వరి కుమారుడు హితేష్ ను ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్. హితేష్ కు టిక్కెట్ కూడా ఇచ్చినా అతను ఓడిపోయాడు. మొన్న ఆ మధ్య వారు పార్టీ వీడతారని వార్తలు వచ్చాయి బహుశా విజయసాయి రెడ్డి చేసిన కామెంట్ అదే సంకేతం ఇస్తుంది.