Vijay Sai Reddy Comments on Nara Lokeshలొక్డౌన్ సమయంలో ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్‌లు హైదరాబాదులోని తమ ఇంటికే పరిమితమయ్యారు. దీనిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత ఈ విపత్కర సమయంలో ఇంట్లో ఉండి సలహాలు ఇవ్వడమేంటంటూ ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

లాక్‌డౌన్ అమలులో ఉండగా ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఇక దేవాన్ష్ వెనకాలే తన తండ్రి లోకేష్ సైకిల్‌ తొక్కుతూ కనిపించాడు. అంతేకాదు స్కేటింగ్ చేస్తున్న దేవాన్ష్‌కు లోకేష్ కొన్ని సూచనలు చేస్తున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. లోకేష్ లొక్డౌన్ నిబంధనలు ఉల్లఘించారు అంటూ ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్టు చేసి దుయ్యబట్టారు విజయసాయి రెడ్డి.

ఇక్కడ విశేషం ఏమిటంటే… లాక్ డౌన్ నిబంధనల గురించి వేదాలు వల్లిస్తున్న విజయసాయి రెడ్డి ఒక రోజు విశాఖలో ఉంటే, ఇంకో రోజు అమరావతి వెళ్తారు. ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా చుట్టేస్తున్నారు. అలాగే ప్రభుత్వం చేసే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ కనీసం సోషల్ డిస్టెంసింగ్ కూడా పాటించకుండా ఫోటోలకు పోజులు ఇస్తారు.

ఆ విషయం పక్కన పెడితే ఒక పూట జనం కష్టాల్లో ఉంటే చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో కూర్చున్నారు అంటూ విమర్శిస్తూ… మరో పూట లోకేష్ లొక్డౌన్ రూల్స్ ని ఉల్లంఘిస్తున్నారు అంటూ ఆరోపించడం విజయసాయి రెడ్డి వంటి వారికే చెల్లింది. నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది అన్నట్టు ఉంది విజయసాయి రెడ్డి వ్యవహారం అంటూ టీడీపీ వారు విమర్శిస్తున్నారు.