వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఒక్కోసారి చిత్రంగా ఉంటాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీసులతో గౌరవ వందనం అందుకుని ఇంటి పైకప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ ఒక్కరే అని, ఇది ఆయన శుద్ధ బద్ధకానికి, తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

జిల్లా కేంద్రాలలో ఏ మంత్రులు జండా వందనం చెయ్యాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు. లోకేష్ కు అవకాశం రకా ఆయన ఇంటి దగ్గర ఆయన జండా వందనం చేసారు. సరే అది పక్కన పెడితే ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి విశాఖ జిల్లా నాతవరం మండలం డి.యర్రవరం వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

విశ్రాంత శిబిరానికి సమీపంలోనే స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు చేశారు. జగన్‌ నేరుగా శిబిరం నుంచి అభివాదం చేస్తూ వచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. మరి జగన్ కూడా శుద్ధ బద్దకం వల్లనే దీక్షా శిబిరం వద్ద జండా ఆవిష్కరించారా? గాలివాటపు విమర్శలు చేస్తే ఇలానే ఉంటుంది కదా?