vijay-sai-reddy-andhra-pradesh-olympic-association-chairmanవిజయసాయి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ… రాజ్యసభ సభ్యుడు… అన్నిటికంటే ఆ పార్టీలో నెంబర్ టూ. జగన్ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి కీలకం. తెరవెనుక పార్టీ వ్యూహాలు రచిస్తూ, పార్టీ కోసం ఢిల్లీలో రాయభారాలు నడుపుతూ… మీడియా ముందు ప్రత్యర్థులను తూర్పారబెడుతూ విజయసాయి రెడ్డి జగన్ కు అన్ని రకాలుగానూ అండదండలుగా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆయనకు జగన్ మొట్టమొదటి పదవిని కట్టబెట్టారు.

ఆంద్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. దీనికి చైర్మన్ గా విజయసాయి రెడ్డి..అధ్యక్షుడుగా దర్మాన కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. క్రీడల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో ఎపిని స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా తీర్చుదిద్దుతామని కొత్తగా ఎన్నికైన వారు చెప్పుకొచ్చారు. గతంలో ఈ పదవికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చైర్మన్ గా ఉండేవారు. ప్రభుత్వం మారడంతో పాలకపక్షం మారిపోయింది.

మరోవైపు జగన్ కేబినెట్ విస్తరణ పై దృష్టి పెట్టారు. దానికి 8వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నారు. రాజకీయ అవసరాలతో పాటు సుదీర్ఘ కాలంగా నమ్మకం ఉన్న వారితో కేబినెట్ సమతూకంగా ఉండాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు వై విజయసాయి రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడానికి ఆయన రాజ్యసభలో ఉండటమే మేలని జగన్ భావిస్తున్నారని సమాచారం.