Vijay Mallya Loans Indian Banks 9000 Crభారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలలో అప్పులు చేసి విదేశాలకు పారిపోయిన ‘లిక్కర్ కింగ్’ విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత బెయిల్ పై విడుదల కావడం అంతా వడివడిగా జరిగిపోయాయి. అయితే విజయ్ మాల్యాను ఇండియాకు తీసుకురావడంపై ప్రస్తుతం చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై కేంద్ర స‌ర్కారు గత ఏడాది కాలంగా బ్రిటీష్ అధికారుల‌తో సంప్రదింపులు జరుపుతుండగా, అన్ని అనుకున్నట్లు జరిగితే ఓ నెలలో ఇండియాకు తీసుకురావచ్చనేది లేటెస్ట్ అంచనా.

అయితే దేశంలోని వివిధ బ్యాంకులకు విజయ్ మాల్యా ఎంతగా “టోపీ” పెట్టారో పరిశీలిస్తే…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 1650 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 800 కోట్లు
ఐడీబీఐ బ్యాంక్ – 800 కోట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా – 650 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా – 550 కోట్లు
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 430 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 410 కోట్లు
యూకో బ్యాంక్ – 320 కోట్లు
కార్పొరేషన్ బ్యాంక్ – 310 కోట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ – 150 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – 140 కోట్లు
ఫెడరల్ బ్యాంక్ – 90 కోట్లు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ – 60 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ – 50 కోట్లు
మరో 3 బ్యాంకింగ్ సంస్థలకు – 603 కోట్లు
మొత్తం – 6963 కోట్లు
పై మొత్తానికి వడ్డీలు, పెనాల్టీలు కలిపితే మాల్యా కట్టాల్సిన మొత్తం 9 వేల కోట్లకు పైమాటే!