vijay donated 5 crores to chennai floodsసినిమాల్లో పెద్ద పెద్ద డమ్మీ సాహసాలను చేసే వారిని మనం హీరోలు అంటాం. కాని నిజ జీవితంలో సాహసాలు చేసినా, సేవా కార్యక్రమాలు చేసిన, సాయం చేసినా కూడా పెద్దగా గుర్తింపు ఉండదు. తాజాగా తమిళనాడులో కురిసిన వర్షాలకు చెన్నై నగరం అంతా కూడా అతలా కుతలం అయిన విషయం తెల్సిందే. దాంతో చెన్నైను ఆదుకునేందుకు ఎంతో మంది ముందడుగు వేశారు. కోట్లలో విరాళాలను అందించేందుకు పలువురు ముందుకు వచ్చారు. సినిమా స్టార్స్‌ ఎంతో మంది లక్షల్లో సాయం చేశారు. అయితే ఇలయదళపతి విజయ్‌ మాత్రం ఏకంగా 5 కోట్ల ఆర్థిక సాయంను ప్రకటించి అందరిని ఆశ్చర్య పర్చాడు.

ఆర్థిక సాయం 5 కోట్లతో పాటు తనకు చెన్నైలో ఉన్న పలు ఫంక్షన్‌ హాల్స్‌లలో వరద బాదితుల సహాయార్థం శిభిరాలను ఏర్పాటు చేయడం జరిగిందట. ఆ శిభిరాల్లో ఉన్న వారికి సొంత ఖర్చుతో విజయ్‌ అన్ని అవసరాలను తీర్చినట్లుగా చెబుతున్నారు. దాదాపు వారం రోజుల పాటు వేల మందికి విజయ్‌ తన సొంత ఖర్చులతో భోజనం మరియు ఇతర ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తమిళ సినిమా సెలబ్రెటీల్లో ఏ ఒక్కరు కూడా ఇంత సాయం చేసింది లేదు. అందుకే తమ అభిమాన హీరోను నిజమైన హీరో అంటూ విజయ్‌ అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. తమిళంకు చెందిన పలువురు స్టార్‌ హీరోల సాయం లక్షల్లోనే ఉండి పోయింది.