Vijay Deverakonda-the real star‘పెళ్లిచూపులు’ సక్సెస్ తో మొదలైన ప్రస్థానంలో ‘అర్జున్ రెడ్డి’ కీలక మలుపు తిప్పగా, ‘గీత గోవిందం’ ప్రధాన రహదారిపై నిలబెట్టింది. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ దూకుడుకు ‘నోటా’ బ్రేకులు వేయగా, ఏమవుతుందో అని ఎదురుచూసిన ‘టాక్సీవాలా’ భారాన్ని అంతా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు దేవరకొండ.

ఈ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అన్న సంగతిని పక్కన పెడితే… స్టార్ హీరోలకు ఉండే లక్షణాలను విజయ్ దేవరకొండ అందిపుచ్చుకున్నాడని ఈ సినిమా చెప్తుంది. సినిమా ఫలితాన్ని తమ అభినయంతో జయించగల సత్తా స్టార్ హీరోల సొంతం. ఒకవేళ వారి సినిమాలు ఫెయిల్ అయినా… వారి నటనతో విమర్శకుల ప్రశంసలు పొందుతారు. అలాగే ఒక్కోసారి కేవలం వారి అభినయం వలనే సినిమాలు మరో లెవల్ కు చేరుతాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఈ ఫేజ్ లోనే ఉన్నట్లుగా కనపడుతోంది. ‘టాక్సీవాలా’పై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ లభించింది. టాక్ విషయంలో అభిప్రాయ బేధాలు ఉన్నాయేమో గానీ, విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రజెన్స్ లో మాత్రం ‘సింగిల్ టాక్’ వ్యక్తమవుతోంది. అందుకే ‘టాక్సీవాలా’ పాజిటివ్ టాక్ లో ఎక్కువ శాతం క్రెడిట్ విజయ్ దేవరకొండ ఖాతాలోకే వెళ్లిపోతోంది.

ఇక ఇతర హీరోల నుండి విజయ్ దేవరకొండను వేరు చేస్తోన్న అంశం ‘పబ్లిసిటీ.’ తన సినిమాను ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకువెళ్ళాలో విజయ్ కు తెలిసినంతగా మరే ఇతర హీరోకు తెలియదని చెప్పడంలో సందేహం లేదు. నేడు స్క్రీన్ పైన ‘టాక్సీవాలా’గా కనిపించనుండడంతో, రియల్ లైఫ్ లోనూ తన కారును తీసుకువెళ్ళి ‘టాక్సీవాలా’గా మారిపోయాడు విజయ్. అందుకే యూత్ అంతా విజయ్ దేవరకొండ నామస్మరణ చేస్తూ ఊర్రూతలూగుతున్నారు.