Vijay-Deverakonda---Taxiwaalaతన యాటిట్యూడ్ తో విశేషమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం “గీతగోవిందం” సినిమా ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. ఈ సినిమా టీజర్ వీక్షకుల చేత ప్రశంసలు పొందడంతో పాటు రికార్డు స్థాయిలో డిజిటల్ వ్యూస్ అందిపుచ్చుకోవడంతో, సంతోషంలో మునిగి తేలుతున్నాడు విజయ్ దేవరకొండ.

ఆగష్టు 15వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో, గతంలో వాయిదా వేసుకున్న “టాక్సీవాలా” సినిమాను పూర్తిగా మరిచిపోయినట్టున్నాడు విజయ్. గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేశామని, మళ్ళీ కొత్త డేట్ ను ప్రకటిస్తానని తనదైన శైలిలో ప్రకటన చేసిన విజయ్, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

నిజానికి ‘టాక్సీవాలా’ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ పబ్లిసిటీని ‘గీత గోవిందం’ వైపుకు మలిచి ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు గానీ, “టాక్సీవాలా” అతి ఆలస్యం ప్రేక్షకుల ఆసక్తిని దూరం చేస్తోందని గమనించాలి. బహుశా ‘గీతగోవిందం’ సూపర్ హిట్ ‘టాక్సీవాలా’కు మరింత కలిసి వస్తుందని ఆశిస్తున్నారేమో!