Vijay-Deverakonda---Taxiwaala-Teaserప్రస్తుతం మార్కెట్ లో క్రేజీ ఉన్న హీరోలలో ఎవరైనా ఉన్నారంటే… అందులో విజయ్ దేవరకొండ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ‘అర్జున్ రెడ్డి’తో సంపాదించిన పాపులారిటీతో, విజయ్ ని ఒక స్టార్ హీరోగా ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకే విజయ్ ఎలా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడోనని సినీ అభిమానులంతా ఆసక్తిగా ఆలకిస్తున్నారు.

తాజాగా ‘టాక్సీవాలా’ టీజర్ రిలీజ్ వేదిక పైన మరోసారి తనదైన స్టైల్ లో దేవరకొండ ప్రసంగాన్ని ఇచ్చాడు. “ఈ సినిమా సరికొత్తగా ఉంటుందని, ఒక స్ట్రెస్ బస్టర్ లా పని చేస్తుందని, మే 18వ తేదీన ‘టాక్సీవాలా’ ఏ ధియేటర్ లో ఉందో చూసుకుని, ఓ పాప్ కార్న్ బకెట్ తీసుకువెళ్ళి ధియేటర్ లో కూర్చోండి… నవ్వుకుని చస్తారు, పక్కా నవ్వుకుని చస్తారు” అంటూ నొక్కివక్కాణించారు.

‘అర్జున్ రెడ్డి’ ఈవెంట్ లో ‘మాద….’ అనే డైలాగ్ ను రిపీట్ చేసిన దేవరకొండ, ఇక్కడ ‘నవ్వుకుని చస్తారు’ అని స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. అయినా నవ్వుకుని చావడమేంటి? ఇదేం తెలుగయ్యా అంటూ వాపోవడం వీక్షకుల వంతయ్యింది. వాస్తవానికి వెనుక ఉన్న బన్నీ వాసు, మారుతీలు కూడా విజయ్ మాటలు వింటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు.