ఎంతదాకైనా వెళ్తానంటోన్న విజయ్ దేవరకొండ...!తమ్ముడిని స్టార్ చేయడం కోసం అన్నయ్య విజయ్ దేవరకొండ ఎంత కష్టపడుతున్నాడో తెలిసిందే. విజయ్ స్టార్ హీరోగా మారిన తర్వాత తమ్ముడిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చాడు. దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అనుకున్నంత రేంజ్ లో నిలదొక్కుకోలేకపోయాడు. చేసిన ప్రయత్నాలు ఫలించలేవు. ఇపుడు తాజాగా ఆనంద్ నటించిన పుష్పక విమానం ఈనెల 12న విడుదల అవుతోంది. ఇందులో ఆనంద్ డీసెంట్ స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆద్యంతం వినోదాత్మక మూవీగా మలిచినట్లు కనిపిస్తోంది. అయితే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఆనందర్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

ఇక ఇదంతా పక్కనపెడితే…ఈ మూవీ ప్రమోషన్లో విజయ్ దేవరకొండ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ప్రొడ్యూసర్ గా ఉన్నప్పటికీ తమ్ముడిని బిగ్ స్టార్ ను చేయాలన్న తపన విజయ్ లో కనిపిస్తోంది. గతంలోనూ ఈ రౌడీ హీరో కొన్ని సినిమాలను నిర్మించాడు. కానీ ఆ సినిమాలపై చూపించనంత ఇంట్రెస్ట్ ఈ సినిమాపై చూపిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెద్ద స్టార్లనే రంగంలోకి దించాడు. ట్రైలర్ లాంచింగ్ కు తనతోపాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్ను కూడా తీసుకొచ్చాడు. బన్నీ రాకతో ఈ మూవీకి బోలెడంత ఫ్రీ ప్రచారం దొరికినట్లైంది. ఇక ఈ ఇద్దరు బ్రదర్స్ కూడా సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు. యూట్యూబుల్లో ఇంటర్య్వూలు అంటూ అన్నింటిని చుట్టేసుకోస్తున్నారు.

ఈనెల 7న ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ పోర్ట్ గ్రౌండ్ లో నిర్వహించనున్న కార్యక్రమానికి విజయ్ హాజరవుతున్నాడు. ఎలాగైనా తమ్ముడిని స్టార్ చేయాలన్న సంకల్పంతోనే విజయ్ ఇంతగా చొరవ తీసుకున్నట్లు అర్థమౌతోంది.