Join-Me-in-Showing-Middle-Finger---Vijay-Deverakondaవిజయ్ దేవరకొండ ప్రవర్తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని యాటిట్యూడ్ చూసే చాలామంది అభిమానులుగా మారిపోయారు. అయితే ఒక్కోసారి ఆ యాటిట్యూడ్ హాట్ టాపిక్ గా మారిపోతుంటుంది. ప్రస్తుతం అలాంటి చర్చకే దారితీసారు దేవరకొండ. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “టాక్సీవాలా” సినిమాకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.

ముఖ్యంగా ఈ సినిమా పైరసీకి గురికాబడిన నేపధ్యంలో…. “ధియేటర్లలోనే చూడండి… పైరసీని ప్రోత్సహించవద్దు…” అంటూ తెలిపారు. దీనికి రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ “అన్నా, ఫస్ట్ మాకు ‘సాహో’ అప్ డేట్ ఇవ్వండన్న’ అంటూ కౌంటర్ మాదిరి వేసాడు. ప్రభాస్ పై అభిమానంతోనే ‘సాహో’ అప్ డేట్స్ అడిగి ఉండవచ్చు గానీ, సందర్భం సరైనది కాకపోవడంతో ‘మిస్ ఫైర్’ అయ్యింది. ఎందుకంటే ఇటీవలే ‘సాహో’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.