Geetha_Govindam_Movie_Live_Updatesనెక్స్ట్ బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్… సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రస్తుతం విజయ్ దేవరకొండ గురించి వినిపిస్తోన్న మాటలు. “గీత గోవిందం” ద్వారా విజయ్ ఎంత సక్సెస్ అందుకుంటాడు? ఎన్ని రికార్డులు కొల్లగొడతాడు? అనేది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో విజయ దేవరకొండ నూటికి నూరు మార్కులు పొందాడు.

ఎలాంటి సన్నివేశం అయినా ప్రేక్షకులను అలరించేలా భావవ్యక్తీకరణ చేయడం విజయ్ కున్న ప్రధాన ప్లస్ పాయింట్. “గీత గోవిందం”లో అలాంటి అభినయాన్నే ప్రదర్శించాడు. ఆడియో వేడుకలో అల్లు అర్జున్ చెప్పినట్లు… ఈ సినిమాలో హీరోయిన్ ది డామినేటింగ్ రోల్ అయినప్పటికీ, విజయ్ తన అభినయంతో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. దీంతో సక్సెస్ కొలమానంకు అతీతంగా సినీ విమర్శకులు విజయ్ కు నీరాజనాలు పలుకుతున్నారు.

ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” వంటి ఒక పాత్ బ్రేకింగ్ మూవీతో తన మార్క్ ను చూపించిన విజయ్, దానికి పూర్తి వ్యత్యాసమైన క్యారెక్టర్ ను అద్భుతంగా పండించి, ధియేటర్లలో ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకునేందుకు బాటలు వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలతోనే ఒక నటుడి కెరీర్ ను అంచనా వేయలేం, కానీ ఉజ్వలమైన భవిష్యత్తు విజయ్ దేవరకొండ ముందుందన్న నమ్మకాన్ని ఈ రెండు సినిమాలు కలిగించాయని చెప్పడంలో సందేహం లేదు.

కమర్షియల్ సక్సెస్ లు వేరు… ఒక నటుడి స్టామినా వేరు..! కానీ ఈ రెండు పుష్కలంగా ఉన్న మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అతికొద్దిమంది నటుల సరసన విజయ్ దేవరకొండ నిలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే… “ఎస్… “గీత గోవిందం”తో విజయ్ దేవరకొండ డన్ ఇట్ అగైన్..!” అంటున్నారు టాలీవుడ్ పండితులు, తెలుగు ప్రేక్షక జనం..! కాదనలేం మరి!