Vijay-Deverakonda-Hint-on-First-Star-Directorప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ ఉదంతం. సిల్వర్ స్క్రీన్ పై అనూహ్యమైన రికార్డులు బద్దలు కొట్టిన “గీత గోవిందం” స్మాల్ స్క్రీన్ పైన కూడా అదే స్థాయిలో ప్రదర్శితమైంది. ఇటీవల ఈ సినిమా బుల్లితెరపై ప్రదర్శితం కాగా, రికార్డు స్థాయిలో 17.17 టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.

ఈ ఫిగర్ మహేష్ బాబు “భరత్ అనే నేను” కంటే ఎక్కువ. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో “రంగస్థలం” అద్వితీయంగా బుల్లితెరపై 19.5ను సొంతం చేసుకోగా, ఆ తర్వాత స్థానంలో “గీత గోవిందం” 17.17 దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాలలో భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాలు నిలిచాయి.