The-Deadly-Combo-to-Get-Back-Vijay-Deverakonda's-Starhoodరామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో ‘ఫైటర్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఛార్మితో కలసి ఈ సినిమాను నిర్మిస్తారాయన. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. హిందీ వెర్షన్‌కు కరణ్‌ జోహార్‌ భాగస్వామిగా వ్యవహరించనున్నారట.

ఈ సినిమా మొదటగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాడట పూరి. అయితే ఇప్పుడు పాన్ – ఇండియా సినిమాగా చేస్తుండడంతో దానిని ముంబై బ్యాక్ డ్రాప్ గా మార్చేసారట. దీనితో సినిమా 80% ముంబై లో చెయ్యబోతున్నారట. ఇది ఇలా ఉండగా బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం కోసం విజ‌య్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర పోరాట కళల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.

అందుకోసం థాయ్‌లాండ్ వెళ్లాడు. అక్క‌డ 15 మంది ట్రైనర్స్‌ను నియమించుకుని కసరత్తులు చేస్తున్నాడు. ఇండియన్ సినిమా లో ఇంతకు ముందెన్నడూ లేనంతగా అతంటిక్ గా ఫైట్స్ ఉండబోతున్నాయి అంటున్నారు. కఠిన శిక్షణ తీసుకోవడంతో పాటు కఠిన ఆహార నియమాల్ని పాటిస్తున్నాడు. ఈ నెలాఖరులో ముంబైలో షూటింగ్ ప్రారంభం అవుతుంది.

ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేమ నేపథ్యంలోనే ఈ చిత్రం వస్తుంది.. పైగా టైటిల్ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ కాబట్టి లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.