Vijay Deverakonda calls his fan sai టైటిల్ చదవడానికి కాస్త నమ్మసఖ్యంగా లేక పోయినా, ఒక్కసారి ఈ మ్యాటర్ చదివితే నమ్మి తీరాల్సిందే. ఒక హీరోతో ఫోటో కోసం, ఒక హీరో స్మైల్ కోసం, ఇంకా చెప్పాలి అంటే హీరో ఆటొగ్ర్యాఫ్ కోసం ఫాన్స్ ఎంత పరితపించి పోతారో, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎంత నార్మల్ గా మాట్లాడుకున్నా అందరం ఏదో ఒక హీరోకి వీరాభిమానులమేగా. మరి అలాంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత అభిమాన ప్రపంచంలో ఒక హీరో తన అభిమాని నంబర్ తీసుకునే తానే ఫోన్ చేస్తే, ఎలా ఉన్నావ్ అంటూ ఆ అభిమానిని పలకరిస్తే ఎలా ఉంటుంది? అంతకన్నా ఒక అభిమానికి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ ఏమైనా ఉంటుందా చెప్పండి. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ఆ అభిమాని పేరు ఎంతో తెలుసా? ఒక్కసారి ఈ మ్యాటర్ పై ఒక లుక్ వెయ్యండి.

అసలు మ్యాటర్ ఏంటి అంటే టాలీవుడ్ లో తన వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ. అయితే చేసినవి పట్టుమని పది సినిమాలు లేకపోయినా తొలి సినిమా ‘పెళ్లి చూపులు’తోనే మన తెలుగు వారికి తెగ కనెక్ట్ అయిపోయాడు మన విజయ్. అయితే ప్రతీ హీరోలో అభిమానుల విషయంలో ఏదో ఒక రేర్ క్వాలిటీ ఉన్నట్లే, మన విజయ్ లో కూడా అభిమానుల విషయంలో ఆ ఇది కనిపించింది. తానే స్వయంగా తన నంబర్ నుంచి ఫోన్ చేసి తన అభిమానికి షాక్ ఇచ్చాడు విజయ్. అంతేనా, తన అభిమాని ఏం చేస్తున్నాడు? ఏం చదువుతున్నాడు? ఎగ్స్యామ్స్ రిసల్ట్స్ ఎప్పుడు? ఆ రిసల్ట్స్ వచ్చాక ఏం చెయ్యబోతున్నాడు? ఇలా అభిమాని కరియర్ గురించి అడిగి తెలుసుకున్నాడు విజయ్. ఇక అభిమానంతో ఊగిపోయిన సదరు అభిమాని, విజయ్ ని కలవాలి అని ఉత్సాహంగా ఉన్న క్రమంలో ఒక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా నేనే కలుస్తా నిన్ను అంటూ విజయ్ చెప్పాడు. ఇక ఆ మాటకు ఫిదా అయిపోయిన సదరు అభిమాని, ఆనంద అంచుల్లో తెలిపోయాడు అంటే నమ్మండి.

ఏది ఏమైనా, ఇలాంటి ఆలోచనతో విజయ్ సరికొత్త పద్దతికీ శ్రీకారం చుట్టాడు అనే చెప్పాలి. ఎందుకంటే తాము నష్టపోయినా పర్వాలేదు కానీ, తమ అభిమాన హీరో సక్సెస్ అవ్వాలి అని ఆలోచించే పిచ్చి అభిమానులు మన హీరోలకు కోట్లల్లో ఉన్నారు. మరి అలాంటి హీరోనే తనకు తానే తన అభిమానిని పలకరిస్తే, అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. అదన్న మాట అసలు మ్యాటర్.