Vijay Deverakonda brother Anand Deverakonda coming into movies‘అర్జున్ రెడ్డి’ని తన పేరులా మార్చేసుకున్న యువహీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే “టాక్సీవాలా” రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ, మరోవైపు తన సోదరుడి ఎంట్రీకి కూడా రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం యూత్ లో అత్యంత క్రేజ్ ఉన్న నటుల్లో విజయ్ స్థానం అగ్ర భాగం. దీంతో ఈ తరుణంలోనే తన సోదరుడు ఆనంద్ దేవరకొండను పరిచయం చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటోన్న ఆనంద్ ను టాలీవుడ్ లోని ప్రముఖ బ్యానర్ ద్వారా పరిచయం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

ఇండస్ట్రీలో వారసులను పరిచయం చేయడం సర్వసాధారణం అయిపోయిన నేపధ్యంలో… హీరోయిన్ల సోదరిమణులు, హీరోల సోదరులు రావడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఇలా రెండవ విడతలో ఎంట్రీ ఇచ్చిన వారిలో సక్సెస్ ఫుల్ గా నిలబడింది మాత్రం చాలా తక్కువ. మరి ఆనంద్ దేవరకొండ ఏం చేస్తాడో చూడాలి?