vijay deverakonda as Sobhan Babu in jayalalithaa biopic thalaiviస్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందులో కంగనా రనౌత్ హీరోయిన్ గా తలైవి అనే చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషలలో నిర్మితం అవుతుంది. ఈ సినిమాలో శోభన్ బాబు పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదించినట్టు సమాచారం.

విజయ్ ఈ తరం అమ్మాయిల కలల రాకుమారుడైతే శోభన్ కొన్ని సంవత్సరాల పాటు సోగ్గాడిగా అమ్మాయిలకు నిద్రలేకుండా చేసేవారు. దీనితో విజయ్ ఆ పాత్రకు సరైన ఛాయస్ అని అంటున్నారు. అయితే ఈ పాత్రను చిత్రంలో ఏ మేరకు చూపిస్తారు అనేది చూడాలి. శోభన్ బాబు జయలలిత అనేక సినిమాలలో కలిసి నటించారు.

అంతే కాకుండా వారిద్దరి నిజజీవిత రిలేషన్ గురించి అనేక వార్తలు ఉన్నాయి. ఆ కోణం సినిమాలో ఏమైనా చుపిస్తారేమో చూడాలి. అయితే సినిమాలో జయ రాజకీయ జీవితాన్నే ఎక్కువ టచ్ చేస్తే ఆ పార్టుని అసలు ముట్టుకోకపోవచ్చు. జయలలిత ఇష్టసఖిగా ప్రియమణి కనిపిస్తుందట.

ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను నిరాశపరచిందనే చెప్పుకోవాలి. ఈ తరుణంలో సినిమాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. అమల పాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను ఇచ్చారు.