vijay-devarakonda likes to work with Director Vasan Balaఓ ట్రైలర్ చూసి విజయ్ దేవరకొండ ఫ్లాట్ అయిపోయాడు. అదే విజయ్ భాషలో అయితే… మెంటల్ లేస్తోందని చెప్పాలి. ‘ది మ్యాన్ హూ ఫీల్స్ నో పెయిన్’ పేరుతో ఆగష్టులో విడుదలైన ట్రైలర్ ను చూసిన విజయ్ దేవరకొండ, ‘వాట్ ఎ ట్రైలర్ – మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్’ అంటూ కితాబిచ్చాడు. ఇక్కడితో ఆగితే ఈ సెన్సేషనల్ హీరో స్పెషాలిటీ ఏముంటుంది?

సదరు ట్రైలర్ ను అందించిన వాసన్ బాలాను తనతో వర్క్ చేయాల్సిందిగా ఎలాంటి మొహమాటం లేకుండా కోరాడు. ఇప్పటికే తను ఆ ప్రాజెక్ట్ లో ఉన్నట్లుగా ఫిక్స్ అయిపోయానన్న భావనను వ్యక్తపరచగా, అందుకు సదరు దర్శకుడు లైక్ చేయడం విశేషం. అయితే ఈ ట్రైలర్ చూసిన వారంతా, తెలుగులో తెరకెక్కించాలంటే విజయ్ దేవరకొండను మించిన హీరో లేరనే చెప్పడం ఖాయం.

జీవితంలో తను అనుకున్నది సాధించాలనే ఓ యువకుడికి ఉండే ఒక జబ్బును హైలైట్ గా చేసుకుని, చాలా ఫన్ గా ఈ ట్రైలర్ తెరకెక్కింది. పెయిన్ అంటే తెలియని ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండను ఊహించుకుంటే, ప్రేక్షకులకు కూడా మెంటల్ లేయడం ఖాయమని చెప్పవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ తెలుగులో విజయ్ తో రూపుదిద్దుకోవాలని ఆశిద్దాం.