Vijay Devarakonda, Vijay Devarakonda Rajamouli, Vijay Devarakonda Likes Rajamouli, Vijay Devarakonda Likes SS Rajamouli, Vijay Devarakonda Loves Rajamouli, Vijay Devarakonda Respects Rajamouli‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా వెండితెరకు హీరోగా పరిచయమైన దేవరకొండ విజయ్, సినీ ఇండస్ట్రీలో తన ఆకాంక్ష ఏమిటో తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళిని కలిసే అవకాశమొస్తే చాలని, చాలా హ్యాపీగా ఫీలవుతానని తన గమ్యాన్ని వివరించారు. అలా రాజమౌళితో కొద్దిసేపు మాట్లాడుతూ టైంపాస్ చేస్తానని, తనకు హారర్ చిత్రాలంటే అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ, రాజమౌళి దర్శకత్వంలో కనుక ఇటువంటి సినిమాలో నటించే ఆఫర్ వస్తే నటిస్తానని అన్నాడు.

నవ్వించే సన్నివేశాల్లో నటించడం తనకు కష్టమని, మొదటి టేక్ లో అయితేనే ఇటువంటి సన్నివేశాలు బాగా చేయగలుగుతానని, అదే కనుక ఎక్కువ టేక్ లు తీసుకుంటే సహజత్వం ఉట్టిపడేలా నటించడం తనకు కొంచెం కష్టమవుతుందని ‘పెళ్లి చూపులు’ అనుభూతులను కూడా వివరించాడు విజయ్. ఈ సినిమాలో చూపిన సహజమైన నటనతో తెలుగు చిత్ర సీమలో అవకాశాలు వస్తుండడంతో.., ప్రస్తుతం ‘పెళ్లిచూపులు’ విజయంతో పాటు, భవిష్యత్తు అవకాశాలపై మిక్కిలి సంతోషంగా ఉన్నాడు దేవరకొండ.