Vijay Devarakonda Latest Response On Rumor‘పెళ్లిచూపులు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రామిసింగ్ యాక్టర్ గా టాలీవుడ్ నాట ప్రచారం జరుగుతోన్న ఈ యువహీరోపై ఇటీవల ఓ వార్త హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ‘మహానటి’ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై సమంత పక్కన ఛాన్స్ కొట్టేయడంతో పాటు, రియల్ స్క్రీన్ లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. సినిమా విషయం ఎలా ఉన్నా… పెళ్లి విషయాన్ని మాత్రం విజయ్ మరీ కామెడీగా మార్చేశాడు.

తాను 14 గంటలు ఫ్లైట్ లో ఉంటే, ఇండియాలో నా పెళ్లి చేస్తున్నారంట. నేను, నా భార్యతో పాటు నా ఇద్దరు కుమారుల పేర్లు రమ్మీ అండ్ డమ్మీ అని చెప్పడం మీడియా మరిచిపోయినట్టుంది. ఇందుమూలంగా అందరికీ ధన్యవాదాలు… అంటూ విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఫన్నీ గాసిప్’ బాగుందంటూ తన పెళ్లి వార్తలను ఈ విధంగా ఖండించాడు ఈ ‘అర్జున్ రెడ్డి.’ సాఫ్ట్ గా కనపడుతున్నాడు గానీ, ఈ యువ హీరో గట్టి పిండమే అంటున్నారు… ఈ సమాధానం చూసిన సినీ జనాలంతా..!