Vijay Antony cuts his remuneration to 25 percentకరోనా కారణంగా ఫిలిం ఇండస్ట్రీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. షూటింగ్లు లేవు, థియేటర్లు మూతపడ్డాయి. ఎప్పటికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది అనే దాని మీద ఎవరికీ ఐడియా లేదు. ఈ తరుణంలో సినిమాలు బడ్జెట్లు తగ్గకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుందని అందరు అంటున్నారు. దాని కోసం హీరోలు, డైరెక్టర్లు ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సంక్షోభంలో సినీ నిర్మాతలను కాపాడటానికి బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ముందుగా ముందడుగు వేశాడు. తన రాబోయే మూడు చిత్రాలకు తన రెమ్యూనరేషన్ లో 25% తగ్గించుకుంటున్నటు ప్రకటించాడు. ఈ మూడు చిత్రాలూ వివిధ దశల్లో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి…. త్వరలో విడుదల కానున్నాయి.

ఈ చర్య వల్ల సినిమాల మొత్తం ఖర్చులు తగ్గుతాయని, సినిమాకు సురక్షితంగా విడుదల కావడం ద్వారా నిర్మాతలను రక్షించవచ్చని విజయ్ ఈ నిర్ణయానికి వచ్చాడట. దేశంలోని అన్ని పరిశ్రమలలోని నిర్మాతలు ఇంకా చాలా మంది నటులు మరియు దర్శకులు దీనిని అనుసరిస్తారని ఆశిస్తున్నారు.

టాలీవుడ్ నుండి ఏ స్టార్ మొదటి అడుగు వేస్తాడో చూడాలి. విజయ్ ఆంటోనీ నటుడిగా, సంగీత దర్శకుడిగా మరియు నిర్మాతగా సుపరిచితుడే ఈ తమిళ నటుడు తన సినిమాలను క్రమం తప్పకుండా తెలుగులోకి డబ్ చేస్తున్నాడు. అతను తెలుగులో బిచ్చగాడు తో బ్లాక్ బస్టర్ సాధించాడు, కానీ అతని తదుపరి చిత్రాలు ఆ మేరకు విజయం సాధించలేకపోయాయి.