vijay-antonyతెలుగునాట “బిచ్చగాడు” సృష్టించిన సంచలనం తెలియనిది కాదు. కేవలం లక్షల రూపాయలలో డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకుని, కోట్లకు పడగలేత్తేలా చేసింది ఈ సినిమా. అలాగే విజయ్ అంటోనీకి తెలుగు నాట ఒక ఫాలోయింగ్ సృష్టించి పెట్టింది. దీంతో తమిళంలో ప్రస్తుతం రూపొందిస్తున్న ‘సైతాన్’ చిత్రం కూడా తెలుగులో ‘బేతాళుడు’ రూపంలో ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతోంది.

కేవలం బాక్సాఫీస్ వద్దే కాదు, బుల్లితెరపై కూడా అంచనాలు వేయలేనటువంటి రికార్డులను అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఏ సినిమా అందుకోలేనటువంటి టీఆర్పీ రేటింగ్స్ ను ‘బిచ్చగాడు’ అందుకుందని, ట్రేడ్ వర్గాల సమాచారం. గత ఆదివారం జెమిని టెలివిజన్ లో ప్రసారమైన ఈ సినిమా ఏకంగా 18.75 టీఆర్పీ రేటింగ్స్ ను అందుకుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అంతేకాదు, ‘బిచ్చగాడు’ ప్రభంజనాన్ని తట్టుకోలేని తెలుగు సినిమా ‘సుప్రీమ్’ కేవలం 15.1 రేటింగ్స్ ను మాత్రమే అందుకుంది. దీంతో “బిచ్చగాడు” శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న టెలివిజన్ యాజమాన్యం కూడా పండగ చేసుకుంటోంది. ఈ సినిమా ప్రభావంతో, త్వరలో రాబోతున్న విజయ్ అంటోనీ “భేతాళుడు”పై భారీ అంచనాలు నెలకొన్నాయి.