vijay absence for bigil telugu movie promotionsతమిళ సూపర్ స్టార్ విజయ్ బిగిల్ తెలుగులో విజిల్ గా రాబోతుంది. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే మంచి ఓపెనింగ్ పక్కా అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన మొదటి ప్రెస్ మీట్ కాసేపటి క్రితం హైదరాబాద్ లో జరిగింది.

ఈ ప్రెస్ మీట్ కి దర్శకుడు అట్లీ మాత్రమే వచ్చాడు. నయనతార ఎప్పటిలానే సినిమాల ప్రమోషన్ కు రాదు… ఇక విజయ్ కూడా ఈ ప్రెస్ మీట్ కి రాకపోవడం వివాదాస్పదం అయ్యింది. తమిళ హీరోలకు మన మార్కెటు కావాలి అయితే ఇక్కడ ప్రమోషన్స్ మాత్రం చెయ్యరా అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

పైగా ఈ సినిమా కోసం మిగతా సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద రూట్ కూడా క్లియర్ చేసాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విజిల్‌’ పేరుతో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు అందిస్తున్నారు. సినిమా లేడీస్‌ ఫుట్‌బాల్‌ క్రీడను ఆధారంగా చేసుకుని డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించగా రాజప్ప అనే మాస్‌ క్యారెక్టర్‌తో పాటు.. యంగ్‌ లుక్‌లోని మైకేల్‌ అనే ఫుట్‌బాల్‌ కోచ్‌ పాత్రలో విజయ్ కనిపించనున్నారు.

ఇది ఇలా ఉండగా విజిల్ కు మరో డబ్బింగ్ సినిమా కార్తీ ఖైదీ మాత్రమే బాక్స్ ఆఫీసు వద్ద పోటీగా ఉండబోతుంది. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కానుండడం విశేషం. అయితే చివరకు విజయ్, కార్తీలలో ఎవరిది పై చెయ్యి అవుతుందో చూడాల్సి ఉంది.