Victory Venkatesh to host Bigg Bossబిగ్ బాస్ రియాలిటీ షో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన..పనిలేదు…ఎందుకంటే బిగ్ బాస్ షో అంత ఫేమస్..అయితే ఆ షో ముఖ్యంగా తెలుగులో ఎంతటి అట్టెన్షన్ తీసుకుందో..గత సీజన్ లో కౌశల్ ఆర్మీ చేసిన హంగామానే చెబుతుంది..

ఇదిలా ఉంటే త్వరలో ఈ షో మూడో సీజన్ మొదలు కానుండడంతో ఈ సీజన్ ని ఎవరు హోస్ట్ చేస్తే బావుంటుంది అన్న విషయంపై మీడియాలో రకరకాలా టాక్స్ వినిపిస్తూ ఉన్నాయి…ఈ సీజన్ ని కూడా ఎన్ఠీఆర్ నే హోస్ట్ చేస్తాడు అని ఒక పక్క వినిపిస్తూ ఉన్నప్పటికీ మరో పక్క ఈ సీజన్ ని మన ‘గురు’ విక్టరీ వెంకటేష్ హోస్ట్ చేసే విధంగా ఈ షో నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు..ఇప్పటికీ ఈ వెంకీతో మాట్లాడినట్లు…వెంకీ కూడా సరే అన్నట్లుగా తెలుస్తుంది…

అయితే వెంకీ ఇప్పటివరకూ బుల్లి తెరపై పెద్దగా హంగామా చేసింది లేదు…పైగా ఇలాంటి షోస్ హోస్ట్ చెయ్యలేదు..అయితే వెంకీ హ్యూమర్ ఈ షో కి తోడైతే మాత్రం ఈ షో తోలి రెండు సీజన్స్ కన్నా భారీ క్రేజ్ ను అందుకుంటుంది అని స్పష్టంగా చెప్పవచ్చు..

మరి వెంకీ ఈ షో ని హోస్ట్ చేస్తాడా లేదా అనేది…వెయిట్ అండ్ సీ!