victory-venkatesh-and-director-teja-movie-shootingకెరీర్ ప్రారంభం నుంచి ఏ విధ‌మైన ఇమేజ్ చ‌ట్రల్లో ఇమిడి పోకుండ‌.. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ చిత్రాలు చేస్తున్న క‌థా నాయ‌కుడు వెంక‌టేష్, మూడు ద‌శాబ్ధాల‌కు పైగా త‌న న‌ట ప్ర‌యాణంలో మూస ధోర‌ణి ఎక్క‌డ క‌నిపించ‌దు. త‌న సినిమాలు ఆబాల గోపాల‌న్నీ అలరించేలా ఉంటాయి. వ‌య‌సు పై బ‌డిన త‌రువాత వెంకీ క‌థ‌ల ఎంపిక విష‌యంలో ఆచి తూచి అడుగు వేస్తున్నారు. ఎందుకంటే త‌న వ‌య‌సుకు .. త‌నకు అభిమానుల్లో వున్న గుర్తింపుకు ప్రాధాన్య‌త ఇస్తూ చిత్రాలు చేయాల్సిన బాధ్య‌త ఉంది. అందుకే రాసి కంటే ..వాసికే అగ్ర పీఠం వేస్తూ లేటు అయిన లేటెస్ట్ గా వ‌స్తుంటారు.

గురు చిత్రం తో న‌టుడిగా విక్ట‌రి వెంక‌టేష్ ఎంత క‌మిటెడ్ గా ఉంటాడో ఆడియ‌న్స్ కు మ‌రోసారి తెలియ చెప్పాడు. తాజాగా ద‌ర్శ‌కుడు తేజ తో ఒక కొత్త సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టాడు. త‌మ సొంత బ్యాన‌ర్ లో చేస్తున్న ఈ చిత్రానికి `ఆట నాదే వేట నాదే` అనే పేరు ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తుంది. సురేష్ బాబు తో పాటు.. అనిల్ సుంక‌ర స‌హ నిర్మాత‌గా చేస్తున్నారు. ఈ చిత్రం ఓపెనింగ్ సోమ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగింది.

కుటుంబ అనుబంధాల నేప‌ధ్యంగా సాగే థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రం ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. డిసెంబ‌ర్ 13న వెంక‌టేష్ బ‌ర్త‌డే సంద‌ర్భంగా రెగ్యుల‌ర్ షూట్ చేస్తారు. మ‌రి అబ్బాయి రానా తో నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేసి హిట్ అందుకున్న తేజ‌.. త‌న కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ వెంక‌టేష్ వంటి ఒక స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు. వెంక‌టేష్ ఫ్యాన్స్ కు తేజ ఏరేంజ్ హిట్ ఇస్తాడో తెలియాలంటే వ‌చ్చే ఏడాది వేస‌వి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే మ‌రి.