Viajy Sarkar movie Pre release businessతమిళ టాప్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా చేస్తోన్న ‘సర్కార్’ సినిమా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఫస్టు లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోగా, ఇటీవల విడుదల చేసిన టీజర్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుందనేది కోలీవుడ్ టాక్. తమిళనాడులో ఈ సినిమా 83 కోట్లకి అమ్ముడు కావడం, ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు అద్దం పడుతోంది. మురుగదాస్ – విజయ్ కాంభినేషన్ పై ఉన్న మార్కెట్ ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు.