Viajay Devarakonda fires on geetha-govindam pirateమరికొద్ది గంటల్లో విడుదలకు ముస్తాబవుతున్న “గీత గోవిందం” సినిమా యూనిట్ సోమవారం నాడు ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఎప్పుడూ ఎంతో హుషారుగా కనిపించే విజయ్ దేవరకొండ, ఈ సినిమాకు జరిగిన పైరసీతో డల్ అయిపోయారు. మరదలిపై ప్రేమ ఉంటే ధియేటర్ కు తీసుకెళ్ళి సినిమా చూపించాలి గానీ, ఈ చిల్లర పనులేంటి? అంటూ పైరసీ చేసిన వ్యక్తిపై మండిపడ్డారు.

స్టూడెంట్స్ లో తాను ఒకడిగా భావించే, వారిని అభిమానులు అని పిలుచుకొని తాను, ‘రౌడీ’లంటూ ముద్దుగా పిలుచుకుంటున్నానని, అలాంటి స్టూడెంట్స్ కూడా ఈ సినిమాపై ఉన్న ఆసక్తితో అలా షేర్ చేసుకోవడం బాధేసిందని, కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా మేము అడ్డుకోలేమని, వారు చేసింది అంత నేరమని విజయ్ దేవరకొండతో పాటు చిత్ర యూనిట్ అంతా ముక్తకంఠంతో చెప్పింది.