vi-anand-allu-sirish-upcoming-movieప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ దుమ్ము దులుపుతున్న ఈ సినిమా, ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను దాటి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ద్వారా హీరో నిఖిల్ కు ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయో, దర్శకుడు విఐ ఆనంద్ కు కూడా అదే స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. దీంతో ఆనంద్ ప్రతిభకు మెగా హీరో పట్టం కట్టబోతున్నారు.

‘శ్రీరస్తు శుభమస్తు’ ద్వారా హిట్ అందుకున్న అల్లు శిరీష్ తన తదుపరి చిత్రాన్ని విఐ ఆనంద్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘స్వామి రారా’ వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన చిగురుపాటి చక్రి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ‘టైగర్’తో నిరాశజనకమైన ఫలితాన్ని అందుకున్న ఆనంద్, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో కెరీర్ టర్నింగ్ ఫలితాన్నే అందుకున్నట్లుగా కనపడుతోంది. నిజానికి, అల్లు శిరీష్ చెప్పుకోదగ్గ హీరో కాకపోయినా, ఈ సినిమా ద్వారా ఆనంద్ మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టే అవకాశం లభించింది.