J. V. Ramana Murthi, Veteran Actor,  JV Ramana Murthy, Kanyasulkham, J.V,. Somayajulu , Gireesham, Kanyasulkam, Gurajada Appa Rao, Died, passed away, RIP హృద్రోగ సమస్యతో బాధపడుతున్న 84 సంవత్సరాల వయసు గల ప్రముఖ సినీ నటుడు జేవీ రమణమూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల రీత్యా హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రముఖ నటుడు జేవీ సోమయాజులు (శంకరాభరణం ఫేం) తమ్ముడు అయిన రమణమూర్తి 1957లో ‘ఎమ్మెల్యే’ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు.

సుమారు 150 సినిమాల్లో ఆయన నటించిన రమణమూర్తికి “మాంగల్యబలం, బాటసారి, మరోచరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, శుభోదయం, ఆకలి రాజ్యం, సప్తపది” వంటి పలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక జేవీ రమణమూర్తి తన ఇరవయ్యవ ఏట నుంచే స్వీయ దర్శకత్వంలో గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ప్రదర్శించారు. ఏకధాటిగా 43 ఏళ్ల పాటు వెయ్యి సార్లు సదరు నాటకాన్ని రంగస్థలంపై ప్రదర్శించడంతో, జేవీ రమణమూర్తి నామధేయం కంటే ‘కన్యాశుల్కం’ గిరీశంగానే సుపరిచితం.

సినిమాలలో గొప్ప గొప్ప పాత్రలను ధరించనప్పటికీ, వేసిన ప్రతి పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటులలో జేవీకి స్థానం ఉంటుంది. ఎలాంటి హవాభావలనైనా అవలీలగా పండించగలిగే గిరీశం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుందాం..!