venu udugula -Maidanam - Aha Videoరానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ ప్రధాన పాత్రధారులుగా ‘విరాట పర్వం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వేణు ఊడుగుల తన డిజిటల్ అరంగేట్రానికి సిద్ధం అవుతున్నాడు. అయితే దీని కోసం ఆయన నిర్మాతగా మారనున్నాడు. తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమ నవలలో ఒకటిగా చెప్పబడే చలం రాసిన ‘మైదానం’ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారు.

అల్లు అరవింద్ కి సంబంధించిన ఆహా కోసం ఈ సినిమా తీస్తున్నారు. వేణు దగ్గర పని చేసిన కవి సిద్ధార్థ్ అనే అతను ఈ సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తుతున్నాడు. స్వాతంత్య్ర పూర్వ సమాజంలో కుటుంబ సంబంధాల్లో స్త్రీల అమానుషమైన పీడనను చలం గారు మైదానంలో ఎంతో కవితాత్మతో, ఆగ్రహంతో ప్రస్తావించారు.

అదే టైటిల్ తో ఈ వెబ్ ఫిలిం ని నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా సంతకాన్ని రీజూవనేట్‌ (చైతన్యం) చేయగలిగే అవకాశం ఇస్తుంది గనుక ‘మైదానం’లోకి దూకే సాహసం చేస్తున్నాం అని దర్శకుడు ప్రకటించడం విశేషం. ఓ వైపు దర్శకుడిగా విరాటపర్వం చేస్తూనే, మరోవైపు నవలా చిత్రం నిర్మాణ పనులు చూసుకోనున్నారు వేణు.

మరోవైపు… విరాటపర్వం షూటింగ్ తొందరలో పూర్తి చెయ్యనున్నారు. అయితే ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చెయ్యాలని సురేష్ బాబు ఇప్పటికే డిసైడ్ చేశారు. దానితో ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనేదాని మీద క్లారిటీ లేదు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయం నుంచి 1992 దాకా గ్రామస్థాయి రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విభిన్న కథను తీసుకున్న వేణు ఉడుగుల ఈ స్క్రిప్టు పై పెద్ద గ్రౌండ్ వర్కే చేశారట.