ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్న ‘వెన్నెల’ కిషోర్, సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. తన చిత్రాల అప్ డేట్స్ తో పాటు, కొత్త సినిమాల టీజర్లు, ట్రైలర్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ షేర్ చేసే కిషోర్, తాజాగా “మహానుభావుడు” సినిమా సెట్స్ పై నుండి ఓ వీడియోను షేర్ చేసారు. మారుతీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న “మహానుభావుడు” సినిమా సెట్స్ లో ‘పవర్ స్టార్ గ్లిమ్స్’ను అద్భుతంగా చూపించారు ‘వెన్నెల’ కిషోర్.
ఈ సినిమా సెట్స్ లో ఉన్న ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించిన టీ షర్టును ధరించగా, దానిని తన కెమెరాలో బంధించే విధంగా వెన్నెల కిషోర్ తీసిన షాట్ పవన్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటోంది. మీ టేకింగ్ అదిరిపోయింది, డైరెక్షన్ చేయొచ్చుగా అంటూ నెటిజన్లు చేస్తున్న ట్వీట్స్ కు ‘వద్దన్నో’ అంటూ రిప్లైలు ఇవ్వడం కిషోర్ వంతవుతోంది. ఎంతైనా గత అనుభవం అలాంటిది! గతంలో ‘వెన్నెల వన్ అండ్ హాఫ్, జఫ్ఫా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే.
A glimpse of POWERRR on #Mahanubhavudu sets 😃😃😃🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/QRRyhRcyW9
— vennela kishore (@vennelakishore) 1 August 2017