venky-mama-shooting-starts-in-november-2018యువసామ్రాట్ నాగచైతన్య – విక్టరీ వెంకటేష్ లు కలిసి “వెంకీ మామ” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘జై లవకుశ’ తర్వాత దర్శకుడు బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత నిర్మాత సురేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేసారని, పలు మార్పులు తర్వాత కూడా ఈ స్క్రిప్ట్ పై సంతృప్తి వ్యక్తం కాకపోవడంతో, ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగింది.

ఈ వార్తలు వెలువడిన నేపధ్యంలో… వాటికి శుభంకార్డు పెడుతూ వచ్చే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందన్నది లభించిన సమాచారం. ప్రస్తుతం శివ నిర్వాన దర్శకత్వంలో సమంత జోడిగా “మజిలి” సినిమా చేస్తోన్న చైతూ, దీనితో పాటు ఈ “వెంకీ మామ” కూడా చేయనున్నారు. మరో పక్కన వరుణ్ తో “ఎఫ్ 2” చేస్తోన్న వెంకటేష్, ఈ సినిమాను పూర్తి చేసి “వెంకీ మామ” షూటింగ్ లో జాయిన్ అవుతారు. దీంతో ఈ మల్టీస్టారర్ ఆగిపోయిందనే ప్రచారంలో వాస్తవం లేదని తేటతెల్లమైంది.