Venky Mama release date fixedవిక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య నటించిన వెంకీ మామ చిత్రం విడుదలపై అనిశ్చితి ఉన్న సంగతి తెలిసిందే. దానిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. సినిమా డిసెంబర్ లోనే విడుదల అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. డిసెంబర్ 13న గానీ క్రిస్మస్ కు గానీ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

రెండు మూడు రోజులలో ప్రకటిస్తామని తెలిపారు. డిసెంబర్ 13న వెంకటేష్ బర్త్ డే. ఇప్పటివరకూ వెంకటేష్ సినిమాలు ఏవీ ఆ రోజున విడుదల కాలేదు. దానితో అప్పుడు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. క్రిస్మస్ బరిలో బాలకృష్ణ రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 13కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయట.

ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా, వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. నిర్మాణానంతర పనులు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. తొందరలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇది ఇలా ఉండగా వెంకీ మామ తరువాత వెంకటేష్ తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ లో నటించబోతున్నారు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు.