Venky Mama release date dilemaప్రపంచంలో అతిపెద్ద సీక్రెట్ ఏంటో ఎవరికీ తెలీదు గానీ టాలీవుడ్ లో మాత్రం అది వెంకీమామ రిలీజ్ డేట్ అనుకోవాలి. ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ లో నిర్మాతలు దీనిపై స్పష్టత ఇస్తారు అనుకుంటే అది కూడా జరగలేదు. దీనితో అక్కినేని, దగ్గుబాటి అభిమానులు మళ్ళీ సందిగ్ధంలో పడిపోయారు.

డిసెంబర్ 13న రిలీజ్ అని వార్తలు వినిపిస్తున్నా, ఇప్పుడు సురేష్ బాబు మనసు మార్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చెయ్యడానికి ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. డిసెంబర్ 20న బాలయ్య రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగ రోజే విడుదల అవుతున్నాయి.

25కి ఆ సినిమాల ప్రభావం తగ్గిపోతుంది అని సురేష్ బాబు అనుకుంటున్నారు. ఆ రోజున ఒక రాజ్ తరుణ్ సినిమా ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదు. కాబట్టి ఆ రోజునే విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారంట. ఈ మొత్తం విషయం పై క్లారిటీ రావాలంటే మూవీ టీం అధికారికంగా ప్రకటన చెయ్యాల్సిందే.

నిజజీవితంలో మామా అల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య. ఈ ఇద్దరూ మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెంకీ సరసన ‘ఆర్ఎక్స్ 100’ పాయల్‌ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.