సినిమాకు సరైన క్లైమాక్స్ ఉంటే ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాయో ఒక “పోకిరి” ఒక “టెంపర్” ఒక “ఆ నలుగురు” చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సినిమాలో అంత కీలక పాత్ర పోషించే క్లైమాక్స్ అంశంలో తాజాగా రిలీజ్ అయిన “దృశ్యం 2” డైరెక్టర్ జోసెఫ్ సూపర్ సక్సెస్ అయ్యారు.

చాలా స్లోగా ప్రారంభమైన ఈ సినిమా సెకండాఫ్ కు వచ్చేపాటికి హీరో వెంకటేష్ పోలీసులకు పట్టుబడిపోవడంతో, పోలీసుల నుండి హీరో ఎలా తప్పించుకుంటారు? అన్న ఆసక్తిని దర్శకుడు ప్రేక్షకులకు కలిగించడంలో విజయవంతం అయ్యారు.

ఫైనల్ గా ఏ సినిమాలో అయినా హీరో విజయం సాధించకపోతే ప్రేక్షకులకు నచ్చదు అన్న లాజిక్ తో ప్రారంభమైన క్లైమాక్స్ ట్విస్ట్ “దృశ్యం 2” సినిమాకు ప్రధాన హైలైట్. ఒక విధంగా చెప్పాలంటే… క్లైమాక్స్ లో ఈ మ్యాజిక్ లేకపోతే ‘దృశ్యం 2’ లేనట్టే!

ఇక వెంకీ నటన గురించి చెప్పేదేముంది, 2014లో విడుదలైన ‘దృశ్యం’ రాంబాబుని ఏడేళ్ల తర్వాత కూడా అలాగే స్క్రీన్ పైన ఆవిష్కరించుకోవడంలో సఫలీకృతం అయ్యారు.