అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఆరు నెలల్లో విక్టరీ వెంకటేష్ నుండి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన తదుపరి చిత్రం నారప్ప మే 14న విడుదల అవుతుందని ప్రకటించారు. ఆచార్య తో క్లాష్ అయ్యే పరిస్థితి ఉండడంతో తేదీ మారే అవకాశం ఉంది.
ఆయన చేస్తున్న మరో సినిమా… ఎఫ్3 ఆగష్టు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలతో పాటు ఇంకో సినిమా కూడా వెంకీ లైన్ లో పెట్టాడు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మోహన్ లాల్ దృశ్యం 2 రీమేక్ అది.
మార్చి 6న షూటింగ్ మొదలుపెట్టి 50-60 రోజులలోనే పూర్తి చెయ్యాలని వెంకటేష్ ఆలోచనట. ఎఫ్3 కంటే ముందే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సురేష్ బాబు అనుకుంటున్నారు. ఆ మేరకు దర్శకుడు జీతు జోసెఫ్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. గతంలో వెంకటేష్ దృశ్యం రీమేక్ చేసి హిట్ కొట్టారు.
దృశ్యం ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆరు నెలలో వెంకటేష్ నుండి మూడు సినిమాలు ఖాయం. నారప్ప చాలా వరకు కరోనా కు ముందే పూర్తయినా ఎఫ్3 తరువాత మొదలయ్యిందే. ఈ ప్లాన్ ప్రకారం చేస్తే దృశ్యం 2 కూడా చాలా తక్కువ టైం లోనే ప్లాన్ చేసి ఫినిష్ చేసినట్టు అవుతుంది. ఏది ఏమైనా వెంకటేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి.
Telugu remake of #Drishyam2 is on 👀
Starting in March. pic.twitter.com/qnoSPvMwEH— Antony Perumbavoor (@antonypbvr) February 20, 2021