Venkatesh cameo premam movieచైతూ నటించిన ‘ప్రేమమ్’ సినిమా విడుదలైంది. పూర్తి ప్రేమకధాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ కు ప్రేక్షకుల నుండే కాక, సినీ విమర్శకుల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు లభించడంతో, ఈ రీమేక్ పై సర్వత్రా ఆసక్తి చూపించాయి. అయితే ముందస్తుగా వస్తున్న టాక్ ప్రకారం… రీమేక్ ను పెద్దగా పాడు చేయకుండా, ప్రేక్షకులను అలరించేలా సినిమాను చందు మొండేటి తెరకెక్కించారని, ఒరిజినల్ వర్షన్ లో ఉన్న క్లైమాక్స్ ను కాస్త మార్చారని సోషల్ మీడియాలో అభిమానులు ‘ప్రేమమ్’ గురించి పంచుకుంటున్నారు.

ఇలాంటి ఆసక్తికరమైన అంశాలలో ప్రధానమైనది విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర. ఏ పాత్ర వేయడానికైనా వెనుకడుగు వేయని వెంకీ గెస్ట్ రోల్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో, సిల్వర్ స్క్రీన్ పై ఒక్కసారిగా వెంకీని చూసిన ప్రేక్షకులు థ్రిల్ కు గురవుతున్నారు. ఊహించని వెంకీ ఎంట్రీ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లిందని అక్కినేని అభిమానులు సంబరపడిపోతున్నారు. వెంకటేష్ రోల్ కు సంబంధించిన సమాచారాన్ని ధృవీకరణ చేస్తూ ‘స్క్రీన్ షాట్స్’ను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈగోకు అర్ధం తెలియని వెంకీ గురించి కొత్తగా చెప్పేదేముంది… సినీ ఇండస్ట్రీలో ‘అందరి వాడు’ అంటే ఒక్క విక్టరీనే కదా..!