Babu Bangaram, Babu Bangaram Selvi, Babu Bangaram Selvi Tamil Dubbed, Babu Bangaram Tamil Dubbed Selvi, Venkatesh Babu Bangaram Tamil Selvi, Babu Bangaram Tamil Selvi, Venkatesh Selvi, Nayatara Selvi‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘చిన్నోడు’ ఈ ఏడాది ‘బ్రహ్మోత్సవం’ ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెడదామని భావించాడు. అందుకు అనుగుణంగా ‘బ్రహ్మోత్సవం’ తమిళ సినిమా పోస్టర్లు కూడా విడుదల చేసారు. అయితే చివరి నిముషంలో ఏం జరిగిందో గానీ, ఒక్క తెలుగులో మాత్రమే విడుదలై, బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది ‘బ్రహ్మోత్సవం.’ బహుశా ఫలితాన్ని ముందుగానే ఊహించి తమిళంలోకి తర్జమా చేయడం అనవసరం అని ఊరుకున్నారో ఏమో గానీ, తమిళ ‘బ్రహ్మోత్సవం’ వస్తుందని ఎదురు చూసిన అభిమానులకు హ్యాండ్ ఇచ్చాడు ప్రిన్స్.

‘చిన్నోడు’ పరిస్థితి ఇలా మారితే, ఉన్నట్లుంది ‘పెద్దోడు’ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఇటీవల ఆడియో విడుదల జరుపుకున్న “బాబు బంగారం” సినిమాను తమిళ భాషలోకి డబ్ చేయాలని చివరి నిముషంలో నిర్ణయించుకోవడం విశేషం. అనుకున్నదే తడవుగా తెలుగు ‘బాబు బంగారం’ కాస్త తమిళ ‘సెల్వి’గా మారిపోయి, ఓ పోస్టర్ దర్శనమిచ్చింది. నిజానికి ముందుగా ఈ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేయాలని భావించలేదు. కానీ, చివరి నిముషంలో జరిగిన ట్విస్ట్ తో ‘బాబు బంగారం’ తమిళ భాషలో కూడా డైలాగ్స్ చెప్పనున్నాడన్న మాట.