babu-bangaram-new-poster-venkateshసూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు తన కొత్త సినిమాల ఫస్ట్ లుక్ లను విడుదల చేయడం ఆనవాయితీ. అయితే ఈ సారి దానికి అవకాశం లేకుండా పోయింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలై 10 రోజులే కావడంతో, మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం లేకుండా పోయింది. అలాగే విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ కూడా అంచనాలు అందుకోలేక చతికిలపడడంతో, ఈ ఏడాది మహేష్ తరపు నుండి తండ్రికి సినిమాల పరంగా ఎలాంటి బహుమతిని అందివ్వలేకపోయాడు. అయితే ‘చిన్నోడు’ కాస్త సైలెంట్ అయినా… ‘పెద్దోడు’ మాత్రం సింపుల్ గా చింపేసాడు.

మారుతీ దర్శకత్వంలో ‘పెద్దోడు’ విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘బాబు బంగారం’ ఫ్రెష్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. జూన్ 6వ తేదీన టీజర్ విడుదల చేయబోతున్నామన్న సమాచారంతో కూడిన ఈ పోస్టర్ లో నయనతారతో పాటు ఉన్న వెంకీ, గ్లామర్ విషయంలో ‘చిన్నోడు’కు పోటీ వచ్చే విధంగా సింపుల్ లుక్ లో అదిరిపోయాడు. చూసిన వెంటనే ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మొత్తానికి ఈ ఏడాది కృష్ణ పుట్టినరోజుకు ‘చిన్నోడు’ కొట్టాల్సిన క్రెడిట్ ‘పెద్దోడు’ కొట్టేసాడన్న మాట.