Venkatesh Babu Bangaram movie stillsతన తోటి హీరోలు బాలకృష్ణ, నాగార్జునలు బాక్సాఫీస్ వద్ద తమ ప్రతాపం చూపుతుంటే, తానూ మాత్రం ఏం తక్కువ అనుకున్నారో ఏమో గానీ, లేటెస్ట్ మూవీ “బాబు బంగారం”లో వెంకీ స్టిల్స్ చూసిన షాక్ అవుతున్నారు. గత సినిమాలతో పోలిస్తే… చాలా అందంగా కనపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే యువ హీరోలకు పోటీ ఇచ్చేటంత లుక్ లో దర్శనమిస్తున్నారు.

మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాజాగా మరికొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది చిత్ర యూనిట్. వెంకటేష్ మాత్రమే ఉన్న ఈ ఫోటోలు, విక్టరీ అభిమానులకు ‘విజయం’ కళ్ళ ముందు ఉన్నట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా తెల్ల చొక్కా వేసుకుని నడిచి వస్తున్న ‘బాబు’ను చూస్తూ నిజంగా ‘బంగారం’ లాగానే ఉన్నాడు అంటున్నారు వీక్షకులు.

జూలై 9వ తేదీన ఆడియో విడుదల కానుండగా, అదే నెల మూడవ, లేక చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయిదు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఏంటి ఈ అరాచకం… అని అసూయ పడేటంతగా అలరిస్తున్నాడు వెంకీ. బహుశా ‘మన్మధుడు’ నాగార్జునకు పోటీగా రానున్నాడేమో!