Venkatesh Asuran remake title kora meesamవిక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్యలు నటిస్తున్న వెంకీ మామ చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధం అవుతుంది. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా ఇదే. ఈరోజు చిత్రబృందం ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దీనికి హాజరైన వెంకటేష్ కోర మీసంతో కనిపించారు.

ఇది ఆయన తరువాతి సినిమా అసురన్ రీమేక్ కోసమట. ఆ పాత్ర కోసం వెంకటేష్ వెయిట్ కూడా తగ్గుతున్నారు. అసురన్ రీమేక్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని వేచి చూస్తున్నా అని వెంకటేష్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్టు చేస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్కు పూర్తి అయ్యిందట. స్వల్ప మార్పులు మన నేటివిటీకి తగ్గట్టుగా చేశారట.

సాఫ్ట్ చిత్రాల దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాలను ఈ సినిమాకు ఫైనల్ చెయ్యడం అంటే సాహసం అనే అనుకోవాలి. శ్రీకాంత్ అడ్డాల గతంలో వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పని చేశారు. చివరి సారిగా మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం అనే అట్టర్ ప్లాప్ సినిమా చేశాడు.

ఆ తరువాత ఆయనకు అవకాశాలు రాలేదు. ఈ నెలలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. వేసవిలో విడుదలకు ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమా ఈ ఏడాదిలో వచ్చిన మేటి సినిమాలలో ఒకటి అని విమర్శకులు సైతం కీర్తిస్తున్నారు.