Venkatesh asuran remake shootin anantapurవిక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య ఇటీవలే నటించిన వెంకీ మామ హిట్ అనిపించుకుంది. వెంకటేష్ తన తరువాతి సినిమా, అసురన్ రీమేక్ మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. సంక్రాంతి తరువాత ఈ నెల 20 నుండి సినిమా షూటింగ్ అనంతపురంలో మొదలు కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పలనాడు, కర్నూల్ వంటి ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి ఆ తరువాత వారు అనంతపురమును ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా గతంలో దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రేమించుకుందాం రా, జయం మనదేరా, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు అనంతపురంలో విస్తృతంగా షూటింగ్ జరుపుకుని, ఆ తరువాత హిట్లుగా మిగిలాయి.

ఇప్పుడు అదే సెంటిమెంట్ ను అనుసరించి అసురన్ రీమేక్ కూడా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. సాఫ్ట్ చిత్రాల దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాలను ఈ సినిమాకు ఫైనల్ చెయ్యడం అంటే సాహసం అనే అనుకోవాలి. శ్రీకాంత్ అడ్డాల గతంలో వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పని చేశారు. చివరి సారిగా మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం అనే అట్టర్ ప్లాప్ సినిమా చేశాడు.

ఆ తరువాత ఆయనకు అవకాశాలు రాలేదు. వేసవిలో విడుదలకు ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమా ఈ ఏడాదిలో వచ్చిన మేటి సినిమాలలో ఒకటి అని విమర్శకులు సైతం కీర్తిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో ఏ మాత్రం న్యాయం చెయ్యగల్గుతారో చూడాల్సి ఉంది.